భారతదేశం, మే 4 -- Srikalahasti Road Accident : తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందురు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నలుగురిని బలితీసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ అంబులెన్స్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

ప్రాథమిక సమాచారం ప్రకారం... ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అంబులెన్స్ అతివేగంగా ఉండటం, ఎదురుగా నిలిపి ఉన్న లారీని గమనించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఢీకొన్న వేగానికి అంబులెన్స్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో రోగి బంధువులు, అంబులెన్స్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ...