భారతదేశం, సెప్టెంబర్ 11 -- Fly91 Tirupati Rajahmundry Flights : ప్రాంతీయ విమానయాన సంస్థ 'ఫ్లై91' (Fly91) ఆంధ్రప్రదేశ్‌లో తన విమాన సేవలను వేగంగా విస్తరిస్తోంది. తిరుపతి నుంచి విజయవాడకు విమాన సేవలు ప్రారంభించిన మరుసటి రోజే. శుక్రవారం(సెప్టెంబర్ 11) నాడు తిరుపతి - రాజమండ్రి మార్గంలో కూడా ఈ సంస్థ తమ విమాన రాకపోకలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త సర్వీసుతో కలిపి ఫ్లై91 విమానయాన నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా మొత్తం 13 గమ్యస్థానాలకు చేరుకుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు గురువారం రోజున ఫ్లై91 తొలి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తిరుపతిని ప్రధాన కేంద్రంగా చేసుకుని హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి నగరాలను అనుసంధానించే నూతన విమాన సేవలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గురువారం తిరుపతి...