భారతదేశం, ఆగస్టు 7 -- Air India Express Hyderabad to Tirupati Flights : దేశీయ విమాన ప్రయాణికులకు ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. తిరుపతితో సహా దేశంలోని ఆరు కీలక నగరాలకు సెప్టెంబరు 1వ తేదీ నుంచి కొత్త విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నూతన సర్వీసులు అందుబాటులోకి రావడంతో విమాన అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

ఈ ఆరు నగరాలను దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నైలతో నేరుగా అనుసంధానించనున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లే భక్తులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి తిరుపతికి నేరుగా వి...