భారతదేశం, నవంబర్ 24 -- తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను నవంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. మెుదటి రెండు రోజులు డిప్ విధానంలో టికెట్లు ఇస్తారు. ఆ తర్వాత 8 రోజులు నేరుగా వచ్చేవారికి ఎటువంటి టోకెన్ లేకుండానే తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. డిసెంబర్ 20వ తేదీన వైకుంఠ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ మేరకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. 10రోజుల పాటు రోజుకు 15వేల చొప్పున రూ.300 టికెట్లు ఇస్తారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24న సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా...