Tirumala Temple : తుపానుతో వర్షాలు.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
భారతదేశం, నవంబర్ 2 -- తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అన్నప్రసాదాల పంపిణీకి అంతరాయం లేకుండా, క్యూలైన్లు బయటకు రాకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ మేరకు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలని, సాధ్యమైనంత వరకు క్యూ లైన్లు వెలుపలకు రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వర్షాల కారణంగా అన్నప్రసాదాల పంపిణీకి ఎక్కడా అంతరాయం కలగకుండా అవసరమైన ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.