భారతదేశం, ఆగస్టు 21 -- Tirumala Robot Dog : తిరుమల గిరుల్లో ఆధ్యాత్మిక యాత్రకు వచ్చే లక్షలాది మంది భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సరికొత్త దిశగా అడుగులు వేస్తోంది. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు, భక్తులకు పూర్తి రక్షణ కల్పించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అత్యంత వినూత్నమైన క్వాడ్రుపెడ్ రోబోట్ (నాలుగు కాళ్ల రోబోట్ డాగ్) పనితీరును గురువారం తిరుమలలో పరిశీలించారు.

తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద ఈ రోబోట్ డాగ్ ట్రయల్ రన్‌ను టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. సాధారణంగా అడవుల్లో మనుషులు వెళ్లడానికి వీలుకాని, ప్రమాదకరమైన ప్రదేశాల్లో వన్యప్రాణుల కదల...