భారతదేశం, సెప్టెంబర్ 13 -- తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు, రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ తరువాత వచ్చే వాహనాలను చెక్‌పాయింట్ల వద్ద నిలిపివేస్తారన్న విషయం టీటీడీ దృష్టికి వచ్చింది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది.

ఇది పూర్తిగా అవాస్తవమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని టీటీడీ తీసుకోలేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తను భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు, సమాచారం అధికారిక టీటీడీ ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం ద్వారా భక్తులను అయోమయానికి గురిచేయడం సరికాదు. టీటీ...