Tirumala Garuda Seva : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఈనెలలో రెండుసార్లు గరుడ వాహన సేవ
భారతదేశం, ఆగస్టు 17 -- Tirumala Garuda Seva : కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీవారి ఆలయంలో గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 17వ తేదీ సోమవారంనాడు విశేష ఉత్సవాన్ని నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పవిత్రమైన రోజున స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనసేవ అంగరంగ వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు తన ఇష్టవాహనమైన గరుడునిపై అధిష్టించి, నాలుగు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తారు.
తిరుమల క్షేత్రంలో ప్రతి ఏటా గరుడ పంచమి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. హిందూ సంప్రదాయంలో ఈ పండుగకు అత్యంత విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. కొత్తగా వివాహమైన నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఎల్లప్పుడూ ఆనందదాయకంగా, మంగళకరంగా ఉండాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.