Tirumala Garuda Seva : తిరుమల బ్రహ్మోత్సవాల్లో కన్నులపండువగా గరుడసేవ - గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుగిరులు
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Tirumala Brahmotsavam Garuda Seva : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఆధ్యాత్మిక ఉత్సాహంతో, కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన శనివారం రాత్రి అత్యంత విశిష్టమైన, పవిత్రమైన గరుడసేవ వైభవంగా జరిగింది. రంగురంగుల విద్యుత్ దీపాలు, విదేశీ సుగంధ పుష్పాలతో విశేషంగా అలంకరించిన గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీ మలయప్పస్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దివ్యానుభూతిని అందించారు.
ముందుగా గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, మహిళల కోలాటాలు, జీయ్యంగార్ల దివ్యప్రబంధ ఘోష, మంగళవాయిద్యాల మంత్రముగ్ధ రవళుల నడుమ స్వామివారి ఊరేగింపు పరమ భక్తిభావంతో సాగింది. మాడ వీధుల్లో వేచి ఉన్న అపార భక్తజనం అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ "గోవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.