భారతదేశం, మే 4 -- TTD Summer Arrangements : వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఎండల తీవ్రత, పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యాత్రికుల కోసం ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేపట్టింది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. దర్శనం కోసం వేచి ఉండే సమయంలో అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలను టీటీడీ సమన్వయం చేస్తోంది.

ఎండ తీవ్రత నుంచి భక్తులను రక్షించేందుకు టీటీడీ ఇంజినీరింగ్ విభాగం సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక పనులు చేపట్టింది. బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎండ తగలకుండా భారీ చలువ పందిళ్లను నిర్మించారు. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేలా అదనపు షెల్టర్లను అం...