Tirumala Darshan : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - క్యూ కాంప్లెక్స్ లో వెయిటింగ్ లేకుండానే దర్శనం!
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Tirumala Darshan Timing : కలియుగ వైకుంఠమైన తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుందని అంతా భావించారు. కానీ, తిరుమలలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా మారింది. గత కొన్నిరోజులుగా కిటకిటలాడిన క్యూలైన్లు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లలో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా.. టీటీడీ అధికారులు భక్తులను నేరుగా సర్వదర్శనం క్యూలైన్లలోకి అనుమతిస్తున్నారు.
ఉదయం 8 గంటల తర్వాత వచ్చిన భక్తులకు టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతోందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే రూ.300 శీఘ్రదర్శనం ద్వారా వెళ్లే భక్తులకు కూడా సుమారు 4 గంటల్లోనే స్వామివారి దివ్య మంగళ స్వరూప ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.