భారతదేశం, ఆగస్టు 20 -- Tirumala Brahmotsavam 2026 Updates : ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, టీటీడీ అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ఆదేశించారు.

గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడులతో కలిసి ఈఓ ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ బ్రహ్మోత్సవాల ముందస్తు ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివర...