Tirumala : భక్తురాలి 40 గ్రాముల బంగారు కడియం మిస్సింగ్ - సీసీటీవీ నిఘాతో చేధించిన టీటీడీ విజిలెన్స్! అసలేం జరిగిందంటే..?
భారతదేశం, నవంబర్ 14 -- తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఒక భక్తురాలికి చేదు అనుభవం ఎదురైనప్పటికీ.. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తతతో కథ సుఖాంతమైంది. హైదరాబాద్కు చెందిన శ్రీపాద రాజ శృతి అనే భక్తురాలు శుక్రవారం తిరుమలలో పోగొట్టుకున్న సుమారు 40 గ్రాముల బంగారు కడియాన్ని అధికారులు సీసీటీవీ కెమెరాల సాయంతో గుర్తించి క్షేమంగా ఆమెకు అందజేశారు.
శ్రీపాద రాజ శృతి శ్రీవారి దర్శనం అనంతరం ప్రసాదం పంపిణీ కేంద్రం సమీపంలోని తాగునీటి పాయింట్ వద్దకు వెళ్లారు. అక్కడ నీళ్లు తాగుతున్న సమయంలో అనుకోకుండా ఆమె చేతికి ఉన్న సుమారు 40 గ్రాముల బంగారు కడియం జారి కింద పడిపోయింది. ఆమె ఆ విషయాన్ని గమనించకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. అయితే... ఆమె వెనుకే ఉన్న కొంతమంది ఇతర భక్తులు కిందపడిన బంగారు కడియాన్ని గమనించి తీసుకున్నారు.
కడియం పోగొట్టుకున్న విషయాన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.