భారతదేశం, మే 5 -- Tirumala Donations : కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక అజ్ఞాత భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. 1,00,10,116 భారీ విరాళాన్ని అందజేశారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు నిత్యం అన్నప్రసాద వితరణ జరుగుతుంటుంది. ఈ మహత్కార్యానికి అజ్ఞాత భక్తుడు అందజేసిన ఈ భారీ మొత్తం ఎంతో ఉపయోగపడుతుందని టిటిడి ఈవో అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సదరు భక్తుడి సేవాభావాన్ని, దాతృత్వాన్ని ఈవో అభినందించారు.
హైదరాబాద్‌కు చెందిన ఈ భక్తుడు ఇంతటి భారీ విరాళం ఇచ్చి కూడా పేరు ప్రఖ్యాతులకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. నిజమైన భక్తికి, నిస్వార్థ సేవకు ఇది నిదర్శనమని పలువురు కొనియాడుతున్నారు.
Published by HT...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.