Tirumala : నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం - ఆర్జిత సేవలు రద్దు
భారతదేశం, నవంబర్ 1 -- కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 8వ తేదీన దీపావళి ఆస్థానాన్ని అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
పండుగ రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయంలోని బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో ఈ దీపావళి ఆస్థాన వేడుక జరుగుతుంది. ఈ విశేష ఆస్థానంలో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఘంటా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంపై గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు.
అలాగే స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారికి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షణ దిశకు అభిముఖంగా వేంచేపు చేస్తారు. అనంతరం స్వామివార్లకు అర్చకులు వైఖానస ఆగమ నిబంధనల ప్రకారం ప్రత్యేక ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.