Ticket Price: సింగిల్ స్క్రీన్లు మూతపడాల్సిందేనా.. మమ్మల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి: టికెట్ల ధరలపై ఫిల్మ్ ఛాంబర్
భారతదేశం, ఆగస్టు 20 -- Telangana Movie Ticket Price G.O.: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు, థియేటర్ల వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 77 టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సామాన్య సినీ ప్రేక్షకుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కొత్త నిబంధనలపై పునఃసమీక్ష జరపాలని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అత్యవసరంగా లేఖ రాసింది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది.
ఆగస్టు 14న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 ప్రకారం రాష్ట్రంలోని సినిమా హాళ్లను నాన్-ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లుగా వర్గీకరించారు. ఇందులో 2K/4K ప్రొజెక్షన్, డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ ఉన్న సింగిల్ స్క్రీన్లకు 'స్పెషల్ థియేటర్' కేటగిరీ కింద గరిష్టంగా రూ. 300 వరకు టికెట్ రేటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.