భారతదేశం, ఆగస్టు 20 -- Telangana Movie Ticket Price G.O.: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు, థియేటర్ల వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన జీవో 77 టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సామాన్య సినీ ప్రేక్షకుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కొత్త నిబంధనలపై పునఃసమీక్ష జరపాలని కోరుతూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TSFCC) హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అత్యవసరంగా లేఖ రాసింది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది.

ఆగస్టు 14న రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 ప్రకారం రాష్ట్రంలోని సినిమా హాళ్లను నాన్-ఏసీ, ఏసీ, స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లుగా వర్గీకరించారు. ఇందులో 2K/4K ప్రొజెక్షన్, డాల్బీ 7.1 సౌండ్ సిస్టమ్ ఉన్న సింగిల్ స్క్రీన్లకు 'స్పెషల్ థియేటర్' కేటగిరీ కింద గరిష్టంగా రూ. 300 వరకు టికెట్ రేటు...