భారతదేశం, అక్టోబర్ 27 -- Thriller Web Series: బాలీవుడ్‌లో గ్లామర్, కాలేజ్ రొమాన్స్, డ్యాన్స్ పోటీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఐకానిక్ ఫ్రాంచైజీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' (SOTY). అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ సినిమాను ఇప్పుడు ప్రముఖ మేకర్ కరణ్ జోహార్ ఓటీటీలోకి సరికొత్త రూపంలో తీసుకువస్తున్నారు.

ఇప్పటివరకు మనం చూసిన కాలేజ్ గ్లామర్‌ను పక్కనపెట్టి.. ద్రోహం, అసూయ, సీక్రెట్స్, దారుణమైన హత్యల బ్యాక్‌డ్రాప్‌లో డార్క్ మిస్టరీ థ్రిల్లర్‌గా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' (Student of the Year: After Dark) పేరుతో వెబ్ సిరీస్ ను రూపొందించారు.

తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. నెట్టింట ఇది మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. రీమా మాయా (Reema Maya) దర్శకత్వం వహించిన ఈ...