భారతదేశం, ఏప్రిల్ 17 -- Thimmarajupalli TV Review In Telugu: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్‌గా మారి నిర్మించిన లేటెస్ట్ ఫిల్మ్ తిమ్మరాజుపల్లి టీవీ. వి మునిరాజ్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా విలేజ్ లవ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కింది. నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూలో తెలుసుకుందాం.

టైటిల్: తిమ్మరాజుపల్లి టీవీ

నటీనటులు: సాయితేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, సత్యనారాయణ, అమ్మ రమేష్, లాతిష్ తదితరులు

కథ, ఎడిటింగ్, దర్శకత్వం: వి. మునిరాజ్

సంగీతం: వంశీకాంత్ రేఖన

సినిమాటోగ్రఫీ: అక్షయ్ రామ్

నిర్మాత: కిరణ్ అబ్బవరం

రిలీజ్ డేట్: 17 ఏప్రిల్ 2026

1996 సమయంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. తిమ్మరాజుపల్లి పల్లెటూరులో ప్రతి శివరాత్రికి ఊరంతా కలిసి చందాలేసుకుని పండుగ జరుపు...