భారతదేశం, అక్టోబర్ 17 -- The Paradise OTT: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' (The Paradise) ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. థియేటర్లలో ప్రేక్షకులను ఊరమాస్ యాక్షన్‌తో అలరించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది.

ది ప్యారడైజ్ సినిమా అక్టోబర్ చివరి వారంలో డిజిటల్ స్క్రీన్‌పైకి రానుంది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ చిత్రం ఐదు భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం) స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల లోపే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుండటం విశేషం. ఓటీటీ వెర్షన్ కోసం థియేటర్లలో కట్ చేసిన కొన్ని కొత్త సీన్లను, ఒక ప్రత్యేకమైన సాంగ్‌ను ...