భారతదేశం, మే 10 -- BS Rao The Manity.in Movie Posters Released: టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లే లక్ష్యంతో అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన 'ది మానిటి.ఇన్' చిత్రం పట్టాలెక్కడానికి సిద్ధమైంది. డైరెక్టర్ బీఎస్ రావు భారతీయ సినిమా చరిత్రలో ఎన్నడూ చూడని సరికొత్త విజువల్ వండర్‌ను ప్రేక్షకులకు అందించనున్నారని మేకర్స్ చెబుతున్నారు.

కేవలం వందల కోట్లను మాత్రమే కాకుండా, వేల కోట్ల వసూళ్లను టార్గెట్ చేసుకుని ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈ మూవీ తెలుగు సినిమా మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తుందని చిత్ర దర్శకుడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వీఎఫ్ఎక్స్ విభాగంలో అనుభవం ఉండడంతో టాలీవుడ్‌లో మొట్టమొదటిసారిగా ఈ చిత్రాన్ని IMAX 8K ఫార్మాట్‌లో రూపొందించాలని న...