భారతదేశం, ఆగస్టు 11 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో ఇకపై మహిళా డ్రైవర్లనే నియమించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన 300 కొత్త తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల విభాగాన్ని ఆయన అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబులతో కలిసి మంత్రి పాల్గొని, ఏరియా ఆసుపత్రిలోని నూతన సదుపాయాలైన డయాలసిస్ యూనిట్లు, ఫిజియోథెరపీ ల్యాబ్‌లు, ఆధునిక లేబర్ రూమ్‌లు, ఆర్‌వో నీటి ప్లాంట్‌ను కూడా ప్రారంభ...