భారతదేశం, ఏప్రిల్ 23 -- తెలంగాణలో ఆర్టీసీ కార్మిక లోకం అట్టుడుకుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట బస్ డిపో డ్రైవర్ శంకర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో మరింత ఆందోళన పెరిగింది. అయితే తమ సమస్యల పరిష్కారం కోసం పోరాట బాట పట్టిన కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కేబినెట్ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. "కార్మికులు ఎవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దు.. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావు" అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, ప్రతి కార్మికుడి శ్రేయస్సు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని మంత్రులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం కార్మికులతో ముఖాముఖి భేటీ కా...