భారతదేశం, నవంబర్ 4 -- శబరిమల అయ్యప్ప స్వామి మండల, మకరవిలక్కు పూజల మహోత్సవాల కాలం ప్రారంభమవుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భక్తులకు శుభవార్త అందించింది. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం 2026-27 సంవత్సరానికి గాను ప్రత్యేక బస్సు సర్వీసులను (Sabarimalai Special Bus Services) అందుబాటులోకి తెచ్చింది.

ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించేలా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ప్రత్యేకాధికార క్యారేజ్ బస్సుల బుకింగ్స్‌పై భక్తులకు, గురుస్వాములకు ఆర్టీసీ అనేక రకాల రాయితీలు, ఆఫర్లను ప్రకటించింది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం నిర్వహించే ప్రధాన పూజా సమయాలకు అనుగుణంగా టీజీఎస్ఆర్టీసీ ఈ బస్సులను నడపనుంది. మండల పూజ 16 నవంబర్ 2026 నుంచి 27 డిసెంబర్ 2026 వరకు, మకర విలక్కు 30 డిసెంబర్ 2026 నుంచి 20 జనవరి 2027 వరకు అనుగు...