భారతదేశం, ఏప్రిల్ 11 -- TGSRTC Recruitment Results : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) పోస్టుల రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 29న నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (TGPRB) అధికారికంగా విడుదల చేసింది.

టీఎస్‌టీ విభాగంలో పరీక్షకు హాజరైన 15,796 మంది అభ్యర్థుల్లో 9,377 మంది (59.36 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఎంఎస్‌టీ విభాగంలో 4,817 మంది పరీక్ష రాయగా, వారిలో 2,755 మంది (57.19%) క్వాలిఫై అయ్యారు.

రాత పరీక్షలో కనబరిచిన మెరిట్ ఆధారంగా.... ఒక్కో పోస్టుకు ఐదుగురు అభ్యర్థుల చొప్పున (1:5 నిష్పత్తిలో) సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపిక చేశారు. వీరికి ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో...