భారతదేశం, మార్చి 23 -- తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 198 ఖాళీలున్నాయి. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వీటిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ(టీఎస్‌టీ), మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ(ఎంఎస్‌టీ) పోస్టుల భర్తీకి మార్చి 29వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ట్రాఫిక్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 10 గంటలకు ఉంటుంది. ఇక మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహిస్తారు. టీఎస్‌టీ పోస్టులకు 20,097, ఎంఎస్‌టీ పోస్టులకు 6,063 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నార...