భారతదేశం, ఆగస్టు 27 -- TGSRTC Rakhi Special Buses : రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) తియ్యటి కబురు అందించింది. పండుగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రవాణా సౌకర్యాలను సులభతరం చేసేందుకు సంస్థ యాజమాన్యం విస్తృత స్థాయి ఏర్పాట్లు పూర్తి చేసింది.

పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని 2026 ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా సంస్థ 4,760 ప్రత్యేక బస్సులను మాత్రమే నడిపింది. అయితే ఈ ఏడాది ప్రయాణికుల తాకిడి గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో, గతంతో పోలిస్తే అదనంగా మరో 240 బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగ...