భారతదేశం, జూన్ 18 -- వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసే నీట్ యూజీ 2026 (NEET UG 2026) రీ-షెడ్యూల్డ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఈ నెల 21వ తేదీ జరగనున్న ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ టీజీఎస్‌ఆర్‌టీసీ (TGSRTC) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు.

నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూన్ 16 నాడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసింది. గ్రామీణ ప్రాంతాల నుండి హైదరాబాద్, ఇతర పట్టణాల్లోని పరీక్షా కేంద్రాలకు వచ్చే పేద విద్యార్థులకు రవాణా భారం తగ్గించేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్...