భారతదేశం, నవంబర్ 15 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ప్రజా రవాణా రంగంలో కీలక ముందడుగు వేస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు సంస్థ నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గించుకునే లక్ష్యంతో సుమారు 250 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేసింది. సాంప్రదాయ డీజిల్ బస్సులతో పోలిస్తే ఈ మార్పు వల్ల ప్రతి కిలోమీటరుకు సుమారు రూ. 20 వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం సాధారణ డీజిల్ బస్సుల నిర్వహణకు కిలోమీటరుకు సుమారు రూ. 80 నుండి రూ. 85 వరకు ఖర్చవుతోంది. ఇందులో ఇంధనం, విడిభాగాలు, సాధారణ మెయింటెనెన్స్ వంటి వ్యయాలు కలిసి ఉంటాయి. డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం ద్వారా ఛార్జింగ్ ఖర్చులు తక్కువగా ఉండటమే కాకుండా, ఇంజిన్ ఆయిల్ మార్పులు, గేర్‌బాక్స్, ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటి అనేక మెకాన...