భారతదేశం, ఏప్రిల్ 10 -- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి (2026) నుంచి 2.1 శాతం డీఏను పెంచనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఇంతకు ముందు 50.7 శాతం డీఏ ఉండగా. తాజా పెంపుతో ఇది 52.8 శాతం చేరుతుంది.

గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా డీఏను చెల్లించనుంది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. చివరగా జూలై 2025 లో 2.1 శాతం డీఏ పెంచారు. డీఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్,ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్టీసీలో పెండింగ్ పనులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్ లో ఆర్ ఎం లతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ సమావేశం నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు...