భారతదేశం, ఫిబ్రవరి 27 -- మార్చి 27వ తేదీన శ్రీరామనవమి. ఈ సందర్భంగా భద్రాచలంలో రాములవారి కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాములవారి కళ్యాణంలోని తలంబ్రాలకు చాలా ప్రత్యేకత ఉంది. భక్తులు పవిత్రంగా భావిస్తారు. వాటిని కావాలని అనుకుంటారు. అలాంటి వారి కోసం టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. మీ ఇంటి వద్దే శ్రీరాములవారి కళ్యాణం తలంబ్రాలు పొందవచ్చు.

భక్తులు రూ.151 చెల్లించి.. https://tgsrtclogistics.co.in/TSRTC/ లేదంటే సమీపంలోని టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో బుకింగ్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం 040-69440069, 040-23450033ని సంప్రదించండి. ఇప్పటి నుంచి బుకింగ్ చేయవచ్చు.

మీరు ఉమ్మడి నిజామాబాద్‌వాసులైతే రూ.151కి ఆర్టీసీ కార్గో సర్వీస్ ద్వారా భద్రాచలం శ్రీరామ ఆలయం నుండి పవిత్రమైన కల్యాణ తలంబ్రాలును వారి ఇంటి...