భారతదేశం, మార్చి 5 -- కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. మహాలక్ష్మి పథకం పేరుతో అమలు చేస్తున్న ఈ పథకానికి భారీగా స్పందన ఉంది. డిసెంబర్ 20, 2023న ప్రారంభించిన ఈ పథకం తెలంగాణలోని ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులలో మహిళలు, బాలికలు, లింగమార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది

ఈ పథకం ద్వారా మహిళలు పెద్ద మెుత్తం డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 10, 2026 నాటికి 273.24 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. దీనిద్వారా మహిళలకు రూ.9,360.06 కోట్లు ఆదా అయింది. ఈ పథకం టీజీఎస్ఆర్టీసీ బస్సులలో 81 శాతం అమలులో ఉంది. ప్రయాణికుల సంఖ్య రోజువారీగా 33 శాతం పెరిగిందని తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది.

మరోవైపు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ప్రభుత్...