భారతదేశం, మార్చి 25 -- హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల్లో జనాలు బారులు తీరారు. పెట్రోల్ అయిపోతుందేమోననే భయంతో తరలివస్తున్నారు. కానీ పెట్రోల్ కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో మెట్రో ఏసీ, డీలక్స్ బస్సుల్లో 30 శాతం రాయితీ ఇస్తున్నట్టుగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.

ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో తలెత్తిన ఇంధన కొరత దృష్ట్యా, నగర వాహనదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్న సామాన్యుడి కష్టాలను గమనించి, సుఖవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరకే అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం రాయితీని కల్పిస్తు...