భారతదేశం, జూన్ 18 -- రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆర్పీఎస్-2021కు సంబంధించిన 11 శాతం ఫిట్‌మెంట్‌ను ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు.

రాష్ట్రంలో ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ ఎండీ నాగిరెడ్డితో పాటు పలువురు ఈడీలు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల అధికారితో వెంటనే చర్చించి, గుర్తింపు ...