భారతదేశం, ఆగస్టు 3 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో ఖాళీగా ఉన్న డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఈ పోస్టుల తుది ఎంపిక జాబితాను అధికారికంగా ప్రకటించింది.

సెప్టెంబర్ 17, 2025న జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,743 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించారు. డ్రైవింగ్ టెస్ట్ మార్కులు, వెయిటేజీ మార్కులు, విద్యార్హతలు, వయోపరిమితి సడలింపులు, రిజర్వేషన్ ఆధారంగా మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్(ఏప్రిల్ 23 - జూన్ 25, 2026) అనంతరం ఈ ఎంపికలు పూర్తి చేసినట్లు బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

మొత్తం ప్రకటన చేసిన 1,743 పోస్టులకు గాను అర్హులైన అభ్యర్థుల లభ్యత ఆధారంగా 1,604 మందిని ఎంపిక చేశారు....