భారతదేశం, సెప్టెంబర్ 17 -- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) బస్ స్టేషన్లను వినోద కేంద్రాలుగా (ఎంటర్‌టైన్‌మెంట్ హబ్స్) మార్చే ప్రణాళికలను ప్రకటించింది. వీటిలో మల్టీప్లెక్స్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. ఆర్టీసీ తెలిపిన వివరాల ప్రకారం.. 13 అత్యాధునిక బస్ స్టేషన్లు ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ బస్ స్టేషన్లుగా పనిచేస్తాయి. ఈ విధానం ప్రకారం.. ఆ స్టేషన్ కేవలం రవాణా కేంద్రంగానే కాకుండా, వ్యాపారాలు, వినోదం, ఇతర రవాణా వ్యవస్థల కలయికగా కూడా ఉంటుంది.

ఈ స్టేషన్లలోని సౌకర్యాలు విమానాశ్రయాలను తలపించేలా ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది. 'తెలంగాణ ప్రభుత్వం సహకారం, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి వినూత్న ఆలోచనలతో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం, రవాణా శాఖ నుండి ఇప్పటికే అధికారిక ఆమోదం లభించింది.' అని ఆర్టీసీ తెలిపిం...