భారతదేశం, ఏప్రిల్ 14 -- తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మె చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. సమ్మె సంస్థకూ, ప్రజలకూ తీవ్ర నష్టం కలిగిస్తుందని పేర్కొంటూ ఆర్టీసీ ఉద్యోగులు తమ సమ్మెను విరమించుకోవాలని కోరారు. ఆర్టీసీ సిబ్బందికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చలు, పరస్పర అవగాహన ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు తమ సమస్యలను తెలియజేసి, పరిష్కారాలు కోరడానికి ప్రభుత్వ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు సంబంధించిన విషయాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని, విలీనం అంశంపై ఇప్పటికే ఒక కమిటీ పనిచేస్తోందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ రెండు అంశాలు మినహా, ఉద్యోగులు లేవనెత్తిన మిగతా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.