భారతదేశం, మార్చి 13 -- తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్(TGRJC CET) జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

టీజీఆర్ జేసీ సెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అప్లికేషన్ ఫీజు కింద రూ. 200 చెల్లించాలి. ఏప్రిల్ 15వ తేదీతో దరఖాస్తుల గడువు ముగుస్తుంది. మే 3వ తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

ఇంగ్లీషు మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. సీటు పొందే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ఉంటుంది.మార్చి 2026లో పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఈ ప...