భారతదేశం, అక్టోబర్ 31 -- రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. నవంబర్ 27, 2026 దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. రాత పరీక్షను 2027 జనవరిలో నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 102 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 01 జులై 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. జోన్ల వారీగా పోస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ ...