భారతదేశం, జూన్ 24 -- TGPSC DIET Lecturer Recruitment 2026 : తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు, ముఖ్యంగా విద్యా రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలలో (DIET) ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిర్వహిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 29, 2026 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా మాత్రమే తమ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డైట్ కళాశాలల్లో మొత్తం 86 ఖాళీలను భర్తీ...