భారతదేశం, సెప్టెంబర్ 19 -- TGPSC Manager Recruitment 2026 : నిరుద్యోగు అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డులో ఖాళీగా ఉన్న 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.

ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పోస్టులన్నీ మల్టీజోన్-2 పరిధిలోకి వస్తాయి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు వేతన స్కేలు లభిస్తుంది.

మొత్తం 130 మే...