భారతదేశం, జూలై 2 -- TGPSC Seed Certification Office Recruitment 2026 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త అందించింది. తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఖాళీగా ఉన్న 'సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్' పోస్టుల భర్తీకి కమిషన్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్ రిక్రూట్‌మెంట్ కింద రాష్ట్ర స్థాయి కేడర్‌లో మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు నిర్ణీత విద్యా అర్హతలు కలిగి ఉండాలి. ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బేసిక్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ తో పాటు, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎం.ఎస్సీ (M.S...