భారతదేశం, అక్టోబర్ 17 -- TGPSC Manager Recruitment 2026 : హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పరిధిలో ఖాళీగా ఉన్న మేనేజర్ (ఇంజినీరింగ్) ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొత్తం 130 పోస్టుల నియామకానికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ నేటితో (అక్టోబర్ 17, 2026) ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంకా దరఖాస్తు చేసుకోకపోతే వెంటనే ప్రాసెస్ పూర్తి చేయాలని కమిషన్ వర్గాలు సూచిస్తున్నాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లోని ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మొత్తం 130 మేనేజర్ పోస్టుల్లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి సింహభాగం అవకాశం లభించింది.

ఈ నోటిఫికేషన్ పరిధిలోని పోస్టులన్నీ మల్టీజోన్-2 కిందకు వస్తా...