భారతదేశం, మార్చి 25 -- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) ఓటీఆర్ అప్డేట్ అవకాశాన్ని మరోసారి పొడిగించింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం మార్చి 25వ తేదీ వరకు గతంలో పొడిగించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏప్రిల్ 10వ తేదీ వరకు అవకాశాన్ని ఇచ్చింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఓటీఆర్ నమోదు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం.. ప్రతీ అభ్యర్థికి ఒకే ఓటీఆర్ మాత్రమే ఉంటుంది. ఏ కారణం చేతనైనా అభ్యర్థి లేదా కమిషన్ రద్దు చేసే వరకు చెల్లుతుంది.

ఓటీఆర్ అప్డేట్‌లో తప్పనిసరిగా కొత్త కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. అదనపు విద్యార్హతలు, చిరునామా , ఈడబ్యూఎస్, నాన్-క్రీమీ లేయర్ , మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలను మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. మిగిలిన వివర...