భారతదేశం, అక్టోబర్ 28 -- తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2) పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 24న నిర్వహించిన పేపర్-1, పేపర్-2 పరీక్షల ప్రాథమిక 'కీ' (Preliminary Key)ని టీజీపీఎస్సీ విడుదల చేసింది.

పరీక్షకు హాజరైన అభ్యర్థులు మాస్టర్ ప్రశ్నాపత్రాలను, ప్రాథమిక కీని టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాల ఆధారంగా.. ఈ నెల 30వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో మాస్టర్ క్వశ్చన్ పేపర్లను పొందే సౌకర్యాన్ని కల్పించారు.

ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అభ్యంతరాలను సమర్పించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. నిర్ణీత గడువు ద...