భారతదేశం, అక్టోబర్ 28 -- ప్రభుత్వ ఉద్యోగార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తియ్యటి కబురు అందించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిటిక్స్‌లో ఖాళీగా ఉన్న మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (MPSO) / అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ (ASO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 జోనల్ కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. జీతాల స్కేల్ చూసుకుంటే.. రూ.36,750 - రూ.1,06,990 వరకు ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం 30 అక్టోబర్ 2026 నుంచి ఉంటుది. దరఖాస్తుకు చివరి తేదీ 27 నవంబర్ 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి (01/07/2026 నాటికి) చూసుకుంటే.. ...