భారతదేశం, అక్టోబర్ 18 -- తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది.

కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్షను (CBRT) అక్టోబర్ 24వ తేదీన టీజీపీఎస్సీ నిర్వహించనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ స్పష్టం చేసింది.

పరీక్ష కేంద్రానికి వెళ్లే ముందే అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ( https://www.tgpsc.gov.in/ ) ద్వారా తమ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్ కాపీని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. చివరి నిమిష...