భారతదేశం, మే 17 -- TGMS Inter Admissions 2026 : రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన టెన్త్ విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 25వ తేదీతో అప్లికేషన్ గడువు ముగుస్తుందని అధికారులు ప్రకటించారు.

నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించే లక్ష్యంతో 2013-14లో ప్రారంభమైన ఈ పాఠశాలలు... ప్రస్తుతం రాష్ట్రంలోని 29 జిల్లాల్లో మొత్తం 194 కేంద్రాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ కో-ఎడ్యుకేషన్ పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, సబ్జెక్ట్ ల్యాబ్‌లు మరియు కంప్యూటర్ ల్యాబ్స్ వంటి అత్యుత్తమ సదుపాయాలు ఉన్నాయి. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 180 మోడల్ స్కూళ్లలో విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి కూడా అందుబాటులో ఉంది.

ఇంటర్ మొదటి సంవత్సరంలో చేర...