భారతదేశం, మార్చి 24 -- తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలో ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరగ్గా.. తాజాగా ఫలితాలు ప్రకటించారు. టీజీసీఈటీ 2026 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

హైదరాబాద్‌లోని వెల్ఫేర్ భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్కోర్‌కార్డులను విడుదల చేశారు. లాంఛనంగా విడుదల చేసిన అనంతరం, అభ్యర్థులు, తల్లిదండ్రులు తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా అధికారిక పోర్టల్‌లలో ఫలితాలు యాక్టివేట్ అయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.

ఈ లింక్ క్లిక్ చేసి TGCET ఫలితాలు 2026 చూడండి

సాంఘిక...