భారతదేశం, మార్చి 17 -- రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా. ఇకపై కేంద్ర ప్రభుత్వ 'వాహన్‌' పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వాహనం కూడా వాహన్‌తో అనుసంధానమవుతుంది.

కేంద్ర ప్రభుత్వ 'వాహన్' పోర్టల్ తో అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలోని వాహనాల వివరాలు జాతీయ డేటాబేస్ లోకి వెళ్తాయి. ఫలితంగా వాహనాలకు సంబంధించిన అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి వస్తాయి. ఈ నిర్ణయంతో వాహనదారులకు గతంలో ఉన్న ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత విధానంతో వాహన యజమాని చిరునామా, పేరు మార్పు, వాహన RC డూప్లీకేట్‌ కాపీ వంటి సేవలు ఆన్ లైన్ లో అందుబాటులో లేవు. ఈ సేవల కోసం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సి ఉండేది. కానీ వాహన్ పోర్టల్ అ...